కథ
1810లో యువరాజు లుడ్‌విగ్‌కీ, జాక్స్-హిల్డ్‌బుర్గ్‌హౌజెన్ యువరాణి తెరేజేకీ జరిగిన పెళ్ళి విందుగా ఇది మొదలైంది; ఆ మైదానం ఇప్పటికీ ఆమె పేరే మోస్తోంది — తెరేజియెన్‌వీజె. అది బాగా జరిగింది కాబట్టి మళ్ళీ చేశారు.
మ్యూనిక్‌లోని ఆరు మద్యశాలలు మాత్రమే ఇక్కడ వడ్డించగలవు, అదీ నగర పరిధిలో రైన్‌హైట్స్‌గెబోట్ ప్రకారం తయారైన బీరే. అరవై లక్షల మంది వస్తారు, డెబ్భై లక్షల లీటర్ల దాకా తాగుతారు.
