కథ
జపాన్ లొంగిపోయిన రెండు రోజులకు, జకార్తాలో ఒక ఇంటి ముందు నిలబడి సుకర్ణో, హత్తా రెండు వాక్యాల ప్రకటన చదివారు. డచ్‌వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు, స్వాతంత్ర్య యుద్ధం ఇంకో నాలుగేళ్ళు నడిచింది.
ఆ ఉదయం ఎగరేసిన జెండాను సుకర్ణో భార్య ఫత్మావతి, ఎవరో ఇచ్చిన నూలు గుడ్డతో కుట్టింది; ఏటా ఆ అసలు జెండాను రాష్ట్రపతి భవనంలో బయటికి తీస్తారు.
