కథ
1949 అక్టోబర్ ఒకటిన మావో తియానన్మెన్ వేదిక మీది నుంచి రిపబ్లిక్‌ను ప్రకటించాడు; అప్పటి నుంచి అదే జాతీయ దినోత్సవం.
సైనిక కవాతు ప్రతి ఏడాదీ ఉండదు: పదో, ఇరవయ్యో ఏడాది వంటి వార్షికోత్సవాలకే జరుపుతారు. మధ్య సంవత్సరాలలో ఆయుధాల ప్రదర్శన కాకుండా పూలు, సంగీత కచేరీలు, జెండా వందనం ఉంటాయి.
