కథ
పంచాంగంలో ఇది అతి పురాతన పండుగల్లో ఒకటి, ఒకప్పుడు కొత్త సంవత్సరం కూడా: అతి చిన్న పగలు తర్వాతే యాంగ్ తిరిగి రావడం మొదలవుతుంది, కాబట్టి వెలుగు మొదలైన చోటే సంవత్సరపు లెక్క మొదలయ్యేది.
శీతాకాలపు అయనాంతం కొత్త సంవత్సరమంత పెద్దది అని ఒక సామెత ఉంది; దక్షిణాన కొన్ని చోట్ల ఇప్పటికీ అంతే.
ఉత్తరాన తినే కుడుములను ఝాంగ్ ఝోంగ్‌జింగ్ అనే వైద్యుడికి ఆపాదిస్తారు. చలికి చెవులు పగిలిన ఊరివాళ్ళను చూసి, మేక మాంసాన్నీ మూలికలనూ చెవుల ఆకారంలో పిండిలో చుట్టి వాళ్ళకు వేడిగా వండిపెట్టాడట.
